జపాన్ విశేషాలు - 4 (ఆహారపు అలవాట్లు)  

Posted by ప్రపుల్ల చంద్ర in


జపాన్ అనగానే వీళ్లు అన్నీ తింటారు అని అనుకోకండి, సముద్రంలో దొరికే అన్నింటిని మాత్రం తింటారు. కప్పలు, తేళ్ళు, పాములు మొదలైనవి తినరు చైనా వాళ్లలా !!. వీరి ఆహారంలో ఎక్కువ నూనె వేయరు, ఉప్పు కారాలు ఎక్కువగా వాడరు. చీజ్ ఎక్కువగా తినరు. ప్రపంచంలో ఆరోగ్యకరమైనా ఆహారం వీరిదేనేమో. ఇక్కడి తీపి వంటకాలు అంత తీపిగా ఉండవు. ఒకసారి మా కొలీగ్ కి ’జిలేబి’ ఇస్తే, అతను తిన్న తరువాత ’నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో గొడ్డు కారం తిని ప్రకాష్ రాజ్ ఎలా అరుస్తాడో అలా అరిచాడు. ఆవకాయ తినిపిస్తే చచ్చిపోతాడేమో!!. వీరు ఏ రుచి ఎక్కువ మోతాదులో ఉన్నా తినలేరు. కాని వీరి వంటకాలు చాలా రుచిగా(ప్రత్యేకమైన) ఉంటాయట. శాఖాహారం నేను తిన్నాను, కొన్నింటి రుచి బాగున్నాయి. మాంసాహారం కూడా చాలా బాగుంటుందట, నా స్నేహితులు ఇష్టంగా తింటారు. నేను చెప్పబోయే చాలా విషయాలు నా స్నేహితుల అభిప్రాయలే, ఎందుకంటే ఇక్కడ మాంసాహారం ఎక్కువ గనుక.

వీరి ఆహారం లో అన్నం ఒక ముఖ్యభాగం. వీళ్లు ఆహరం పొడుగు పుల్లలతో ( అదేనండి చాప్ స్టిక్స్ తో !!!) తింటారు కాబట్టి మెత్తగా ఉండేట్టు చూసుకుంటారు, ముద్దగా ఒక్కచోటే ఉంటే పుల్లలతో పట్టుకోవడం సుళువు కదా. ఇక్కడ వీరు మనలా కూరలు చేసుకుంటారు, కాకాపోతే అన్నం, కూర కలుపుకొని తినరు. మొదలు కొద్దిగా కూర తిని, తరువాత కొద్దిగా అన్నం, అలా తింటారు.


జపాన్ ఆహారం అని అనగానే మొదట అందరికీ గుర్తుకు వచ్చేది సుషి. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచూర్యం పొందింది, జపనీయులకు చాలా ఇష్టమైన వంటకం. సుషి అంటే కేవలం పచ్చి చేప మాంసం (raw fish) అని అందరూ అనుకుంటారు, కాని దానితో పాటు వెనిగర్ వేసి చేసే అన్నం (చాలా రుచిగా ఉంటుందట), ప్రత్యేకమైన అల్లం ముక్కలు, ఇంకా వేరే సాస్ ( mayonnise sauce లాంటి ) లతో కలిపి సుషి చేస్తారు. చాలా రకరకాల సుషి లు ఉన్నాయి. దాదాపు సముద్రం లో దొరికే అన్నిటితో ( చేపలు, రొయ్యలు, ఆక్టోపస్, నక్షత్ర చేప, స్క్విడ్ వగైరా వగైరా లతో) సుషి చేస్తారు. రుచిగా ఉండటమే కాక చాలా శక్తిని కూడా ఇస్తుందట. నా స్నేహితుడు సుషి తినడం కోసమని టోక్యో లో పెద్ద చేపల మార్కెట్ ట్సుకిజి (tsujiki) కి ప్రొద్దున్నే 6 గంటలకు వెళ్లాడు, తాజా సుషి దొరుకుతుందని. అప్పటికే చాలా రద్దీగా ఉందట. ప్రొద్దున తింటే మళ్ళీ మరుసటి రోజు వరకు ఏమీ తినలేదు. అంత శక్తి ఇస్తుంది ( పచ్చిది కాబట్టి అరగడానికి చాలా సమయం పడుతుంది, అది వేరే విషయం).


సోబా నూడిల్స్ జపాన్ వారి నూడిల్స్, ఇవి బక్ వీట్ (buckwheat) మరియు గోధుమలతో చేస్తారు. ఇవి మాములు నూడిల్స్ (చైనా నూడిల్స్) లాగే ఉంటాయి కాని గోధుమ రంగులో ఉంటాయి. ఇవి వేరు వేరు సూపులతో తింటారు.



ఉదాన్ అనే ఇంకో రకం నూడిల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇవి మాములు నూడిల్స్ కన్నా లావుగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఇవి గోధుమలతో చేస్తారు. ఇవి కూడా వేరు వేరు సూపులు, పదార్ధాలతో కలిపి తింటారు.



రామెన్, ఇది చైనీస్ నూడిల్స్, సూప్, గ్రుడ్డు, చికెన్ ఇలా చాలా వాటితో కలిపి చేస్తారు.



తోఫు, జపాన్ లో చాలా ప్రాచూర్యం పొందిన శాఖాహారం. ఇది బీన్స్ తో చేస్తారు. ఇది చూడడానికి అచ్చు మన దగ్గరి పనీర్ లా ఉంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. వీటితో రకరకాల వంటకాలు చేస్తారు.



ఒనిగిరి, అన్నం ను 'sea weed' ( ఆకుపచ్చ రంగులో ఉండే పాచి లాంటి పదార్ధం, ఇది సముద్రం లో దొరుకుతుంది) లో చుట్టి, మధ్యలో రకరకాల పదార్ధాలను కలిపి తయారుచేస్తారు. ఇది జపాన్ లో చాలా మంది తినే అల్పాహారం. జపాన్ వాళ్లు చాలా ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి కారణం, ఈ seaweed, సుషి, జపనీస్ టీ ( గ్రీన్ టీ ) తీసుకోవడం వల్లే.



తెంపురా, ఇవి దాదాపు మనదగ్గరి బజ్జీలలాంటివి. ఇవి చాలా కూరగాయలతో చేస్తారు, రొయ్యలతో కూడా చేస్తారు. ఇది కూడా నాకు చాలా నచ్చింది.



యాకితోరి, ఇది చికెన్ తో చేస్తారు (grilled chicken) . ఇది చాలా చోట్ల దొరికే రుచికరమైన వంటకం.

అన్నం తో చేసే లిక్కర్ 'సకే' ఇక్కడ ప్రాంతీయంగా దొరికే మద్యం. అలాగే ఆలుగడ్డ తో చేసే 'సోచో' కూడా.



చాలా స్వీట్స్ ఇక్కడ బియ్యం (పొడి), బీన్స్ లతో చేస్తారు. అన్నింటికన్నా బాగుండేది(ప్రాచూర్యమైనది కూడా) యాట్సుహషి. నాకు చాలా నచ్చింది.



మీరు మైల్ ఫార్వర్డ్స్ లో జపనీస్ కేక్స్ అని చాలా మంచిగా (అందంగా) ఉన్నవి చూసుంటారు. మేము ఒకసారి బయటికి వెళ్లినప్పుడు అచ్చు అలాంటివే చూసాము. నోరూరి ఒక నాలుగు రకాలు తీసుకొని నలుగురము కొద్ది కొద్దిగా తిన్నాము. చాలా చెండాలంగా ఉన్నాయి, నోట్లో పెట్టుకోడానికి కూడా వీల్లేవు. అస్సలు రుచే లేవు. చెప్పాను కదా వీరు తీపి ఎక్కువగా తినరు. మళ్లీ జన్మలో తినొద్దని నిర్ణయించుకున్నాము. మేము తిన్నవే బాగోలేవేమో మాకు తెలియదు. అయినా తియ్యగా లేకపోతే క్రీం రుచి ఏముంటుంది.

సాధారణం గా దాదాపు అన్నీ వంటకాలలో మటన్, పోర్క్, చికెన్, బీఫ్ ఏదో ఒకటి ఉంటుంది. వద్దనుకుంటే 'నిక్కు నాషి' ( మాంసం వద్దు ) అని చెప్తే వెయ్యరు. కాని వీళ్ల దౄష్టిలో చేపలు ( సముద్రం లో దొరికే రొయ్యలలాంటివి కూడా ) మాంసం కాదు. ప్రత్యేకంగా 'సకానా దమే' ( చేపలు వద్దు ) అని చెప్పాలి. ఈ విషయాలలో శాఖాహారులు జాగ్రత్తగా ఉండాలి. మీరే వండుకోవాలనుకుంటే కూరగాయాలు మన దగ్గరిలాగే దొరుకుతాయి, కొన్ని ఇండియన్ గ్రాసరీ షాప్స్ కూడా ఉన్నాయి, కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. మేమైతే రోజు వండుకుంటాము.

మొత్తంమీద చెప్పాలంటే భోజనప్రియులు ( ముఖ్యంగా మాంసాహారులు ) కొత్త రుచికరమైన ఆహారం అది కూడా ఆరోగ్యమైనది తినవచ్చు.

గమనిక : ఫోటోస్ అన్నీ గూగుల్లో వెతికినవి.

This entry was posted on Monday, September 1, 2008 at 8:11 AM and is filed under . You can follow any responses to this entry through the comments feed .

11 comments

ష్, అబ్బా, ఎంతపని చేశారు ప్రపుల్లగారూ,అన్నీ నోరూరిస్తున్నాయ్,కలలో కూడా వాటిని తినలేను, ప్చ్

September 1, 2008 at 10:11 AM

:) :)

September 1, 2008 at 10:54 AM
Anonymous  

ప్రఫుల్ల సాన్, తోతెమో ఓమోషిరోయి దేసునే!

September 1, 2008 at 11:21 PM

నాకు సీ వీడ్ అంటే ప్రేణం!!!! ఒక సారి చైనీస్ రెస్టారెంట్ (Buffet - Eat As much you like for £12) లో ఒక టన్ తిన్నాను. హైద్ లో దొరకదు.

September 2, 2008 at 8:48 AM

ఆహా ఏమి రుచి అని ఒక్క తోఫూకి తప్పించి మిగితా వాటికి చెప్పలేను. :-)

అక్కడ వెజ్ మాత్రమే తినేవారి పరిస్థితి దారుణంగా ఉంటుందేమో కదా?

వ్యాసం చాలా విషయాలను తెలిపింది. నెనర్లు!

September 2, 2008 at 9:49 AM

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి ,
ముంబై, బెంగళూరు లలో జపనీస్ రెస్టారెంట్ లు ఉన్నాయి, హైదరాబాద్, విశాఖపట్నం లలో ఉన్నాయో లేవో తెలియదు. సుషి మీరే తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి, కొద్దిగా సులువే అనుకుంటాను :)

@రవి ,
:)

@sujata ,
సీ వీడ్ ఒక టన్ను తిన్నారా :)

@purnima,
అవునండి కొద్దిగా కష్టమే, జపనీస్ వచ్చిన వాళ్ళతో వెళ్తే కొద్దిగా సులువు అవుతుంది !!!

September 2, 2008 at 7:47 PM

good information prapulla...

September 2, 2008 at 9:33 PM

వెజ్జీలకు కష్టమే అయితే!
మంచి వివరాలు సేకరించారు వారి ఆహార వ్యవహారాల గురించి.

September 3, 2008 at 8:08 AM

@Murali.Marimekala, @రాధిక ,@ప్రవీణ్ గార్లపాటి
నెనర్లు

September 3, 2008 at 10:59 PM
Anonymous  

On reading this essay i felt just as i experienced in japan. I felt very much pain on seeing the train journey. If compared it will much better in India. Even in a well developed country like Japan people are dumped like bags in the train.

September 15, 2008 at 9:07 AM

@ Anonymous,
Thnx for the comment :)
All trains wont be like that.... but in peak hours sometimes situation will be like that and tokyo is heavily populated, eventhough trians are there for every 3 minutes, still they are not sufficient...

September 16, 2008 at 5:59 AM

Post a Comment