ఫుజి పర్వతారోహణం - 4 (చివరి భాగం)  

Posted by ప్రపుల్ల చంద్ర in ,



శిఖరం మీద ముఖ్యంగా చూడవలసినది crator, అక్కడి నుండే లావా వెదజల్లింది. అది చాలా లోతుగా ఉంది !!!. 300 సంవత్సరాల క్రితం లావా అక్కడి నుండే వచ్చింది. ఇప్పుడు అంతా ఏదో తెలుపు రంగులో ఉంది.



ఫుజి పర్వతం నేషనల్ పార్క్ గా గుర్తించబడినది, కాబట్టి ఎక్కడ కూడా టెంట్ వేసుకోకూడదు. కొద్ది సేపటి తరువాత మళ్ళీ మా తిరుగు ప్రయాణం మొదలు పెట్టాము. అంతా మట్టి మట్టిగా ( లావా బూడిదలా ) ఉంది. మట్టి అయ్యేసరికి జారుతూ ఉంది. అలా అయితే కొద్దిగా తొందరగా వెళ్ళొచ్చు. పాము మెలికలలా ఉంది దారి అంతా. నడుస్తూ ఉంటే దుమ్ముంతా పైకి లేస్తూ ఉంది, అందువల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాము.



నడిచివస్తూ ఉంటే ఒక గమ్మత్తైన దృశ్యం కనపడింది, మేఘాలు క్రింది నుండి పైకి వెళ్తున్నాయి, అవి పర్వతం ఎక్కుతున్నట్టుగా అనిపించింది.



తిరుగుప్రయాణం కూడా చాలా సేపు అనిపించింది. అలా మొత్తానికి మా ఫుజి యాత్ర ముగించాము. మొదటి టపాలో చెప్పినట్టు 'He who climbs Mount Fuji once is a wise man. He who climbs it twice is a fool' అని ఎందుకో అర్ధం అయ్యింది. ఇక్కడి కవులు ఫుజిపర్వతం గురించి ఇలా అంటారు, " కొన్నింటి అందాన్ని దూరం నుండి చూసి ఆనందించాలి, దగ్గరకి వెళ్ళి చూడలనుకోకూడదు". ఎందుకంటే ’ఫుజి’ దూరం నుండి చూస్తే చాలా అందంగా ఉంటుంది, దగ్గరికి వెళితే అంతా బూడిద, మట్టి, దుమ్ము.
కాని ఇప్పటికీ ’ఫుజి’ ఎప్పుడు గుర్తు వచ్చిన ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది, అది ఎప్పటికీ మరిచిపోలేని యాత్ర !!!

చిత్రాలపై క్లిక్ చేస్తే మంచిగా చూడవచ్చు...

This entry was posted on Friday, October 31, 2008 at 7:15 AM and is filed under , . You can follow any responses to this entry through the comments feed .

4 comments

ప్రపుల్ల చంద్ర గారూ..! మీ అదన్న మాట సంగతి లో 'పుజి పర్వతారోహణమ్ ' ఫోటోలు అద్భుతమ్ . క్లోజప్ లో మరీ బాగున్నాయి. మీ బ్లాగు చూసినందుకు మంచి తృప్తి లభించింది. thanks.

December 8, 2008 at 2:59 AM

audiseshareddy గారు,
ధన్యవాదాలు

December 8, 2008 at 4:10 AM

ప్రపుల్ల చంద్ర గారు మీ దయవల్ల జపాన్ వెళ్ళి వచ్చినట్లు అయింది అండి.. ఫొటోస్ చాలా బాగున్నాయి.. థేంక్స్

December 9, 2008 at 12:10 AM

@ నేస్తం,
thanks....

December 11, 2008 at 6:23 AM

Post a Comment