ఈ మధ్య క్రాంతి గారు వ్రాసిన ’ఉప్మాపురాణం’ కి పూర్ణిమ గారు వ్యాఖ్య వ్రాస్తూ తను మొదటిసారి చేసిన ఉప్మా గురించి వ్రాస్తా అన్నారు, అది చూడగానే మనకు ఇలాంటి ఒక అనుభవమున్నట్టున్నదే అని ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచన గాలులకి నా జ్ఞాపకాల పుటలు అలజడి చేస్తూ ఒక పేజి దగ్గర ఆగిపోయాయి.
ఒక వేసవి మధ్యాహ్నం, చాలా ఎండలు ఉంటాయి కాబట్టి బయటికి వెళ్ళలేము, సాయంత్రం అయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇంట్లో అందరు పడుకున్నారు, కాని నాకు మధ్యాహ్నాలు పడుకునే అలవాటు లేదు. అప్పట్లో కాస్త చిత్రలేఖనం (drawing) మీద ఆసక్తి ఉండేది, అంటే మిక్కీమౌస్, డొనాల్డ్ డక్ లాంటి కార్టూన్లు గీసేవాడిని.
ఆ రోజు ఏదో దొరికిన కార్టూన్ వేస్తూ కూర్చున్నాను. అంతలో ఎన్టోరు గొంతుతో ఒక కేక వినపడింది,
’బ్రధర్’ అని. చుట్టూ చూస్తే ఎవరు లేరు.
నేను ’ఎవరు?’ అని అడిగా.
’బ్రధర్... నన్ను గుర్తుపట్టలేదా?....... నీ ఆత్మారాముడిని’.
’ఓహ్ నువ్వా’ అన్నాను నేను.
’ఏం.... చేస్తున్నావు?’ అని అడిగాడు.
’ఏముంది బొమ్మ గీస్తున్నాను’,
’తమ్ముడూ... ఇంకా ఎన్ని రోజులు ఇలా ఎలుకల బొమ్మలు, బాతుల బొమ్మలు గీస్తావు’ అన్నాడు.
నేను ’మరి ఎవరి బొమ్మ గీయాలి’ అని అడిగా.
’నేను మొదటినుండి చెబుతున్నా కదా.. మనకు ఆత్మ గౌరవం ముఖ్యం అని’,
వెంటనే నేను ’అయితే నీ బొమ్మ గీయాలా అన్నాను’,
వెంటనే ఆత్మారాముడు చిరాకు పడి, గొంతు మార్చి ’చూపులు కలసిన శుభవేళ’ సినిమాలో కోట శ్రీనివాసరావు లా మాట్లాడటం మొదలుపెట్టాడు. ’కనపడని ఆత్మ బొమ్మ ఎలా గీస్తారట... తమరి ముఖము, మనకు అదియును తెలియదు..... మొదలు తమరి ముఖారవిందాన్ని బాగుగా గీయుడు’ అని చెప్పి వెళ్ళిపొయాడు.
నాకు అనిపించింది, నిజమే కదా ఎన్ని రోజులు ఆ బొమ్మలు వేస్తామని. సరే నా బొమ్మే గీద్దామనుకున్నాను. మరీ అద్దం ముందు కూర్చొని బొమ్మ గీస్తే పిచ్చి పట్టిందని మా వాళ్ళు డిసైడ్ అయిపోతారని, ఫోటో అయితే గీయడానికి కూడా సుళువు గా ఉంటుందని ఒక బ్లాక్ & వైట్ ఫోటో ముందు వేసుకొని కూర్చున్నాను.
ఒక అరగంట కుస్తీ పడ్డ తరువాత చూస్తే ఆ బొమ్మ సూపర్ సినిమాలో అలీ గీసిన బ్రహ్మానందం బొమ్మలా వచ్చింది. ఇది ఏంటి నా బొమ్మ గీస్తే ఎవడిదో వచ్చింది, ఛీ ! నా బొమ్మ కూడా గీయడం రాకపోతే ఈ కళ నాకెందుకు..... అని ఆ రోజే త్యజించా మళ్ళీ ఇప్పటి వరకు ప్రయత్నించలేదు!!!.
సమయం చూస్తే ఇంకా మూడు కావొస్తోంది. నాకు మాత్రం చాలా బోర్ గా ఉంది. మా ఇంట్లో అంతా మంచి నిద్రలో ఉన్నారు. సమయాన్నిచంపడానికి (time killing... అన్నమాట) ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది, మా వాళ్ళు నిద్రలేచే లోపు ఏదైనా ఇస్పెషల్ చేసి వాళ్ళని ఆశ్చర్యచకితులను (surprise) చేద్దామనుకున్నాను. కాని ఏం చెయ్యాలి, అని మళ్ళీ ఆలోచన...... సరే ఏమైనా వంటకం చేద్దామనుకున్నాను. కాని మనకు అసలు ఏమీ రాదే, బాగా చించీ చించీ ’ఉప్మా’ చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చా. మనకు ఉప్మా అంటే చాలా ఇష్టం, ఎప్పుడూ ’అమ్మా ఆకలి’ అంటూ అమ్మ చుట్టూ తిరుగుతూ చూడటమే తప్ప ఎలా చేయాలో తెలియదు.
ఎలా చెయ్యాలో నేనే ఒకసారి మనసులో ఊహించేసుకొని, నెమ్మదిగా చప్పుడు కాకుండా వంటింట్లోకి దూరాను. ఉల్లిపాయ తరిగి పక్కన పెట్టాను. కొద్దిగా శబ్దం అయినా మా వాళ్ళు లేస్తే నా ప్లాన్ తలక్రిందులౌతుందని అన్ని పనులు నెమ్మదిగా చేస్తున్నాను. బాణాలి స్టవ్ మీద పెట్టి ఆన్ చేసాను. కొద్ది సేపటి తరువాత నూనె పోసాను అందులో. బాగా వేడి అయిన తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు గింజలు వెయ్యాలని అన్నీ సిద్దం చేసుకున్నాను, తరువాత నీళ్ళు పోసి, ఉప్పు వేసి, బాగా వేడి అయిన తరువాత రవ్వ వేసి కొంత సేపు ఉంచితే ’ఉప్మా’ రెడీ, ఇక మావాళ్ళు ఆహా అంటూ తింటారు అని మనసులో ఒక అంతరిక్షయానం చేసి భూమి మీద ల్యాండ్ అవ్వగానే, చూస్తే బాణాలిలో అప్పటికే నూనె బాగా వేడి అయ్యింది. ఓహ్ అప్పుడే అయ్యిందా అని, మిర్చి, పోపు గింజలు వేసాను, వెయ్యగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి, దట్టంగా పొగలు వచ్చాయి, ఒక సెకనులో అన్నీ మాడిపోయాయి. ఆ గోలకి అందరు ఉలిక్కిపడిలేచి పరుగెత్తుకుంటూ వంటింట్లోకి వచ్చారు. అక్కడ నా చేతిలో గరిట, చుట్టూ పొగ, దొరికిపోయిన దొంగ లా నా పరిస్థితి, నా నోటి నుండి మాటరాలేదు. అమ్మ ’ఏమైంది రా’ అంది గాభరాగా. నేను ’అంటే..... మీరు లేచేలోపు.... ఉప్మా చేద్దామనుకున్నాను’, మంచి నిద్ర నుండి లేచేసరికి చిరాకులో ఉన్నా ఏమి అనలేక ’నన్నడిగితే చేసేదాన్ని కదా’ అంది. నేనేమి చెప్పలేదు. అలా నా ఉప్మా ప్రయత్నం పూర్తవ్వకుండానే ఆగిపోయింది.
నా ఉప్మా కథ తెలుగు సినిమాలా సుఖాంతం అవుతుందనుకున్నాను ( అంటే ఉప్మా అందరు తిని బాగుంటుందని చెబుతారని ) లేకపోతే కనీసం తమిళ్ సినిమాలా దుఃఖం తో ముగుస్తుందని అనుకున్నాను ( అంటే ఉప్మా సరిగ్గా కుదరక ఎవరికి నచ్చదని, అయ్యో కుదరలేదే అని భాదపడతానని), కాని రెండూ జరగకుండా ఇంగ్లిష్ సినిమాలా ఏ అంతమూ లేకుండా ముగిసింది. తరువాత అమ్మ చేసిపెడితే లొట్టలేసుకుంటూ లాగించాననుకోండి అది వేరే విషయం.
19 comments
ఏంటి ప్రపుల్ల, దీపిక ట్రాన్స్లేట్ చేసుకుని కూడా చదువుతున్నట్లుంది!!!
నీ ఉప్మా పురాణం ఎంత బావున్నా, ఉప్మా నిరోధక సంఘం సభ్యురాలిగా, ఈ టపా నచ్చలేదు అని చెప్పడానికి కించిత్తు కూడా మొహమాట పడట్లేదని చెప్పుకుంటూ, మా పోరాటంలో ముందుకు పోతున్నాం అధ్యక్షా...!!
ప్రపుల్లా "ఇస్పెషల్" ఉప్మా పురాణం అదిరింది. ఉప్మా ప్రేమికుడిగా, నీ టపా చదువుతూ ఉంటే అమ్మ చేతి ఉప్మా తినలనిపిస్తోంది :) ... ఆత్మారావు ఇప్పుడూ కనిపిస్తూ ఉంటాడా ?
quite funny.. :)
బాధ పడకండి, ఉప్మా కథలెప్పుడు ఇలాగే పేలి, విషాదాంతాలవుతాయి మరి!
Hi prapul,
Mee blog chala bagundi.. Upma story is good ,mari ippudina cheyatam nerchukunnara??
ఉప్మా వర్ధిల్లాలి ! నేనూ నర్చుకున్న మొదటి వంటకం ఉప్మానే ! మొదటి ది కాబట్టి రక రకాల రిసల్ట్స్ వచ్చాయి. నాన్న మెచ్చు కున్నారు. అమ్మ పెదవి విరిచారు. చెల్లి బహిష్కరించిది. అక్క విసుక్కుంది. నేను మురిసిపోయి నోట్లో పెట్టుకుని, అంత ఉప్పు తినలేక పడేసేను. మీ ఉప్మా ఏమో కానే మీ పోస్ట్ ఎండింగ్ బావుంది. సీక్వెల్ ఉంటుందా (ఇంగ్లీష్ సినిమా లా )?
బ్రదర్ !! ఒక్క సారి పేలింది కదా అని ఉప్మా ప్రయత్నం విరమించుకోకండి వెంటనే నడుం కట్టి అద్భుతమైన ఉప్మా చేసుకు తిని ఉప్మా ఉపాసకుల్లో చేరిపోండి...
BTW టపా బావుందండీ... మీ ఉప్మాలానే పేలింది :-)
"రెండూ జరగకుండా ఇంగ్లిష్ సినిమాలా ఏ అంతమూ లేకుండా"
భలే!
నేను వేణూ శ్రీకాంత్ గారి ప్రతిపాదనని సమర్ధిస్తున్నాను.
సాధనమ్మున పనులు సమకూరు ధరలోన అన్నారు. రేపే ఒక అరకిలో రవ్వ పేకెట్టు తెచ్చి మొదలు పెట్టండి!
@neeraj prasad alias deepika sood,
thanks for the comment, i feel more happy if you write comment with your name.
@మేధ ,
నెనర్లు, మా ఉప్మా పోరాటం ఆగదు.
@mmksworld,
నెనర్లు, ఆత్మారాముడు ఎప్పుడు అద్దంలో చూసుకున్నా కనపడతాడండి.
@ravindra, @ayushmanbhava,
నెనర్లు
@సుజాత ,
సుజాత గారు, మీరు ఎంత ఉప్మాద్వేషి అయితే మాత్రం ఒక్కసారి అలా జరిగితే ఎప్పుడూ అలాగే అనడం అన్యాయమండి !!!
@Rajesh,
నెనర్లు, ఇప్పుడు నేను తినగలిగేంత నేర్చుకున్నానానండి.,
@sujata ,
మీరు కూడా మొదలు ఇదేనా :),
ఉప్మా వ్యాప్తి కి అందరం కలిసి కృషి చేద్దాము.
సీక్వెల్ లేదండి !!!, తరువాత ఒకసారి నాకు జ్వరం వచ్చినప్పుడు ఉప్పు లేకుండా చేసి, అది బాక్స్ లో తీసుకువెళ్ళి తినలేక చచ్చిపోయాను... అది ఒక సాడ్ స్టోరీ లేండి.
@వేణూ శ్రీకాంత్ , @కొత్త పాళీ ,
నెనర్లు, ఇది 12 సంవత్సరాల క్రితం జరిగినది... ఇప్పుడు పర్లేదు, ఒక మాదిరిగా నేను తినగలిగేంతలా చేసుకోగలను.
@ananymous,
వ్యాఖ్యకి నెనర్లు, మీకు ఏమి నచ్చలేదో వ్రాస్తే బాగుండేది !!!!
అరచేతి ని అడ్డుపెట్టి సూర్యున్ని, సెన్సారోల్లు తెలుగు సినిమా ని ఆపలేరు.
మీ ఉప్మా ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తున్నాం. మీరు మంచి ఉప్మా తయారు చేసి మమ్మల్ని ఒక రోజు ఆహ్వనించాలి మరి.
@MURALI ,
తప్పకుండా !!!!
Hi,
Your experience of first time upma preparation is simply good.
Great comedy, Praful...!!!
Soo funny... Enjoyed it thoroughly..
are u the telugu novelist prafullachandra??..in andra bhoomi etc..?
are u the telugu novelist prafullachandra??..in andra bhoomi etc..?
@Seenu, I am not a novelist :)
Post a Comment
టపాలు
నేను
- ప్రపుల్ల చంద్ర
- చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమి లేదు, శతకోటి బ్రహ్మీ లలో ఒక బ్రహ్మి. నా సరదా ఙ్ఞాపకాలను, ఆలోచనలను, చూసిన ప్రదేశాల విశేషాలను మీతో పంచుకోవాలనే ప్రయత్నమే ఈ బ్లాగ్.