మొదటి టపా  

Posted by ప్రపుల్ల చంద్ర

" Hello world "
ఏంటో, అంతకు ముందు ఏ పని మొదలుపెట్టినా ’శ్రీరామ’ అనో ’ఓం’ అనో రాసి మొదలుపెట్టేవాడిని. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం లో చేరినప్పటి నుండి ఏది మొదలుపెడదామన్నా మొదట "Hello world" వ్రాయడం అలవాటైపోయింది. ఏ కొత్త కంప్యూటర్ భాష నేర్చుకుందామన్నా మొదట ఇదే నేర్పుతారు కదా మరి.
చాలా రోజుల నుండి కూడలి లో బ్లాగ్స్ చదువుతున్నాను. సరే నేను కూడా ఒకటి మొదలుపెడితే బాగుంటుంది అనుకున్నాను, కాని ఎప్పుడు ఏవో పనుల వల్ల వాయిదా వేస్తూ వస్తున్నాను. ఏదో ఒకరోజు మొదలుపెడుదామనుకున్నా కూడలి లో బ్లాగ్స్ చదివాక ఇంత మంచిగా మనం వ్రాయగలమా అని ప్రయత్నాన్ని విరమించేవాడిని. ఇలా అయితే లాభం లేదు, మొదలు రంగం లోకి దూకుదాం తరువాత సంగతి తరువాత చూసుకోవచ్చు అని ఇలా మొదలు పెడుతున్నాన్న మాట. వ్రాయడం మొదలు పెడితేనే కదా తెలిసేది వ్రాయగలమో లేదో అని !!!.
వృత్తిపరంగా ఒక సంవత్సరంగా జపాన్ లో ఉంటుంన్నాను. ఇక్కడి విశేషాలు, అలాగే నా స్వగతాలు ఈ బ్లాగ్ లో వ్రాద్దామనుకుంటుంన్నాను. ఇక మొదలుపెడుతున్నాను నా బ్లాగ్ ప్రస్థానం.

This entry was posted on Tuesday, July 8, 2008 at 7:04 AM . You can follow any responses to this entry through the comments feed .

13 comments

ప్రపుల్లా, బ్లాగ్లోకానికి స్వాగతం... నీ బ్లాగు ప్రస్థానం బహు బాగుగా ఉండాలని ఆశిస్తూ...

July 8, 2008 at 7:28 AM

ప్రపుల్లా బ్లాగు లోకానికి స్వాగతం సుస్వాగతం ... ఇక చలరేగి పో !!!

July 8, 2008 at 7:39 AM
Anonymous  

Very nice blog prafulla....Hello World concept is superb....and u did tremendous job to do this..Will you please translate me the content either in Hindi, English or Punjabi...take care

July 8, 2008 at 7:41 AM

బ్లాగ్లోకానికి స్వాగతం ... సుస్వాగతం ... మొదలు పెట్టినందుకు, మొదటి టపాకు అభినందనలు...

ఇంత చక్కగా, తప్పులు లేకుండా, ఒక ప్రవాహంలా రాయగలిగిన మీరు ఇప్పటిదాకా బ్లాగలేదంటే కొంత ఆలశ్యం చేసినట్టే ... ఇక్కడ బాగా/గొప్పగా రాయటం అనేదేమీ లేదు/పెట్టుకోవద్దు .. రాసెయ్యటమే ... అంతే ... మనం రాసే కోడ్ పనిచేస్తుందో లేదో తెలియకుండా, ఒకవేళ పనిచేసినా ఎప్పటిదాకా అని తేలిసీ/తెలియక ఉన్నా మనం కోడింగ్ ఆపేమా ... అంతే ... రాసెయ్యటమే ... :-)

పర్యాటక/కొత్త ప్రదేశాలు, అనుభవాలు మొదలగునవి రాసేటప్పుడు, మరలా కొన్ని రోజుల తరువాత మీరు చూసుకుంటే/చదువుకుంటే ఇంతకన్నా బాగా అంటే వివరంగా రాయగలిగే వాడినేమో లేక రాసి ఉంటే బాగుండేదేమో అనిపించకుండా రాయండి ... అంటే స్పష్టంగా, వివరంగా, ఫొటోలతో, వెబ్ సైట్ లింక్స్ తో రాయండి ...

మరొక్కసారి అభినందనలు మరియు శుభాకాంక్షలు.

July 9, 2008 at 12:02 PM

ప్రపుల్ల-శాన్,

స్వాగతం. మొదటి ప్రయత్నంలోనే చక్కగా రాశారు. మున్ముందు మరిన్ని మంచి టపాలొస్తాయి మీనుండని ఆశిస్తున్నా.

July 9, 2008 at 3:05 PM

సంతోషం. మంచి టపాల కోసం చూస్తుంటాం. టెంప్లేటు బావుంది.

July 9, 2008 at 5:10 PM

ఆ మధ్యలో జపనీస్ నేర్చుకునేందుకు ప్రయత్నించాను, వదిలేసాను. వీలైనంతగా జపాన్‌ను పరిచయం చేయగలరు.
సోంజా తనషిందే కిటె (OK then, Have fun there)

July 9, 2008 at 7:21 PM

Welcome to the blog's world.. Enjoy ur stay at it.

-Purnima

July 9, 2008 at 11:31 PM

తెలుగు బ్లాగ్లోకానికి సుస్వాగతం...

ఆలస్యమెందుకు రెచ్చిపొండి. ఈ వ్యాధి కాని కాస్త ముదిరితే రోజు రాయకుండా , గంటకోసారి కూడలి తెరవకుండా ఉండలేరు. జాగ్రత్త.ముందే హెచ్చరిస్తున్నా..

July 10, 2008 at 1:32 AM

welcome

July 10, 2008 at 4:36 AM

@ మేధ ,@అబ్రకదబ్ర, @ పూర్ణిమ, @కొత్త పాళీ, @బొల్లోజు బాబా గారు
మీ ఆదర స్వాగతానికి నెనర్లు,
@తెలుగు'వాడి'ని గారు
మీ ప్రోత్సాహానికి నెనర్లు, తప్పకుండా మీ సలహాలను పాటిస్తాను.
@mmksworld
నెనర్లు, బ్లాగ్ టెంప్లెట్ ఇంత బాగా రావడానికి చేసిన సహాయానికి నా ధన్యవాదాలు.
@నాగరాజా గారు ,
నెనర్లు, నేను కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, కాకాపోతే బద్దకం. జపాన్ గురించి నాకు తెలిసినది చెప్పడానికి ప్రయత్నిస్తాను.
@జ్యోతి గారు ,
కూడలి చూసే జబ్బు ముందే వచ్చింది, బ్లాగ్ రాసే జబ్బు ఇప్పుడిప్పుడే వస్తున్నట్టుగా ఉంది.

July 10, 2008 at 6:00 AM

సుస్వాగతం

July 10, 2008 at 8:28 AM

@రాధిక గారు,
నెనర్లు

July 10, 2008 at 4:53 PM

Post a Comment