10. Disney World/Disney Sea:
Disney World చిన్న పిల్లలకోసం అయితే Disney Sea పెద్దవాళ్ళకోసం. ఈ రెండు ప్రక్కప్రక్కనే ఉంటాయి. రెండిటి రైడ్స్ లో తేడా ఉంటుంది. టోక్యో డిస్నీ రిసార్ట్ (రెండూ కలిపి) వాల్ట్ డిస్నీ కి చెందని ఎకైక డిస్నీ రిసార్ట్. అంటే ఇక్కడి ఒక కంపెని డిస్నీ వారి దగ్గర థీం కొనుక్కున్నారు. మేము Disney Sea కు వెళ్ళాము. ఇక్కడి రైడ్స్ బాగున్నాయి, కాని యూనివర్సల్ స్టూడియో తో పోలిస్తే చిన్నవే. అన్ని రైడ్స్ కి వెళ్ళడానికి ఒకరోజు మొత్తం పడుతుంది. కొన్ని రైడ్స్ ముందు "ఈ రైడ్ కష్టంగా ఉంటుంది" అని చాలా హెచ్చరికలు రాసి ఉంటాయి. కాని అంత భయపడేట్టుగా ఏమీ ఉండవు. అన్ని రైడ్స్ లో Tower of Terror(Scary free fall)చాలా బాగుంటుంది. సాయంత్రం 'అగ్ని', 'నీరు' ప్రేమించి పెళ్ళి చేసుకోవడమనే దృశ్యరూపకం చాలా బాగుంటుంది.
11. యొకొహమ:
(yokohama sky tower నుండి నా స్నేహితుడు తీసిన ఫోటో, క్లిక్ చేస్తే పూర్తి చిత్రాన్ని చూడవచ్చు.)
యొకొహమ టోక్యో కి దగ్గర్లో ఉండే అతి పెద్ద నగరం. యొకొహమ లో చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ’మినతొమిరయి’ లో చాలా పెద్ద పెద్ద భవనాలను చూడవచ్చు. అక్కడి ’Landmark tower' జపాన్ లోనే అతిపెద్ద భవనం. 69వ అంతస్తులో observatory ఉంది. దానికి ఎదురుగానే పెద్ద Ferrous wheel ఉంటుంది (ఇది ప్రపంచంలో పెద్దది). yokohama sky walk అనే ప్రదేశం నుండి ఈ భవనాల view బాగుంటుంది.
యొకొహమ లో పెద్ద చైనాటౌన్ కూడా ఉంది. యొకొహమ పోర్ట్, డాల్ మ్యూజియం, యమషితా పార్క్ లు చూడ దగ్గ ప్రదేశాలు.
12. ఓడైబ:
సరదాగా ఒక రోజు గడపడానికి ఈ ప్రదేశం బాగుంటుంది. ఇక్కడ మ్యూజియం లు, షాపింగ్ కాంప్లెక్స్ లు ఉంటాయి. ఇక్కడి ప్రదేశాలన్నిటిని కలుపుతూ ’యురికమమొ’ రైల్వే లైన్ ఉంటుంది. ఇది మొనొరైల్ (డ్రైవర్ లేకుండా నడిచే రైళ్ళు). ఇంకా పడవలో కూడా వెళ్లవచ్చు. రేయిన్ బో బ్రిడ్జి క్రింది నుండి వెళ్ళే పడవ ప్రయాణం చాలా బాగుంటుంది. అక్కడ మరైన్ మ్యూజియం, సైన్స్ మ్యూజియం, సోని మ్యూజియం, పానాసోనిక్ మ్యూజియం, ఫుజి టివి భవనం, ఆక్వాసిటి షాపింగ్ కాంప్లెక్స్ చూడవచ్చు.
13. ఉఎనొ పార్క్:
cherry blossom కి చాలా ప్రఖ్యాతిగాంచిన పార్క్. వసంతకాలంలో మొత్తం రంగులపూలతో (ముఖ్యంగా పింక్) అందంగా ఉంటుంది. ఆ సమయంలో చాలా మంది కుటుంబాలతో, స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చి, తెచ్చుకున్న ఆహారపదార్ధాలు తింటూ సరదాగా గడుపుతారు. ఇంకో పది రోజుల తరువాత మొదలయి ఒక ౩ వారాలు చూడటానికి బాగుంటుంది.
కమకుర, ఫుజి పర్వతం, హకొనె, నాగఓకా హనాబి ల గురించి నా పాత టపాలు చూడగలరు. చాలా పెద్ద పెద్ద రోలర్ కోస్టర్ ల తో ఫుజి క్యు హై లాండ్స్ (ఫుజి పర్వతం దగ్గర) చాలా బాగుంటుందట, కాని వెళ్ళటం కుదరలేదు.
ఇంకో మూడు రోజులలో ఇండియాకి తిరిగి వస్తున్నాను. ఇక జపాన్ నుండి, జపాన్ గురించి ఇంతే సంగతులు.
సయోనరా !!!! (మీకు కాదులేండి, జపాన్ కు)
11 comments
woww...చాలా బాగా కళ్ళకు కట్టినట్లు ఫొటోల తో సహా చుపించేసారు జపాన్ ని :) ధన్యవాధాలు
welcome back to Bangalore :)
emaina special arrangements cheyamantava cheppu!!!
Hope you had great time in Japan!
@Murali.Marimekala ,
చాలా రాసావు :),
anyway we had a great time !!
@నేస్తం , @ రవి ,
నెనర్లు, ఎప్పటికప్పుడు వ్యాఖ్యలు రాస్తూ ప్రోత్సాహపరిచినందుకు ధన్యవాదాలు...
@మేధ,
నాకు పబ్లిసిటి ఇష్టం ఉండదు ;) అయినా పర్వాలేదు.. మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి :)
welcome back to bangalore
స్వాగతం :)
@చైతన్య.ఎస్ ,
thank you :)
మీ జపాన్ కబుర్లు బాగున్నాయి,ఫోటోలతో ఓపిగ్గా వివరించారు.
@శ్రీ,
నెనర్లు
prafulla gaaroo baavunnayanDi mee japan photolu
japaan vellakapoyinaa baagaa meebloglo andarakee choopinchaaru...
kruthajnathalu....
చాలా బాగా కళ్ళకు కట్టినట్లు ఫొటోల తో సహా చుపించేసారు జపాన్ని
http:/kallurisailabala.blogspot.com
Post a Comment
టపాలు
నేను
- ప్రపుల్ల చంద్ర
- చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమి లేదు, శతకోటి బ్రహ్మీ లలో ఒక బ్రహ్మి. నా సరదా ఙ్ఞాపకాలను, ఆలోచనలను, చూసిన ప్రదేశాల విశేషాలను మీతో పంచుకోవాలనే ప్రయత్నమే ఈ బ్లాగ్.